సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు వచ్చినట్లు నిరూపిస్తారా అని టీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో తాను చేసిన పనేంటో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, కేసీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు.
సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. పేద ప్రజలు బర్లు, గొర్లు పెంచాలి గానీ కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యం ఏలుతానంటోందన్నారు. కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసం తగ్గిందని, ఆయన మాటలు కాలక్షేపం కోస మే వినాలన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో చనిపోయిన అమరులకు ఇంతవరకు న్యాయం జరగలేదని, అమరులను గుర్తించడానికి 51 నెలల సమయం సరిపోలేదన్నారు. సమైక్యవాది అయిన హరికృష్ణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వం.. చనిపోయిన తెలంగాణ ఉద్యమకారులకు ఆ విలువ ఇవ్వడం లేదన్నారు.
గ్రామాల్లో మొహం చెల్లకే..
రాష్ట్ర ప్రజలు ఢిల్లీకి గులాములం కారాదంటున్న కేసీఆర్.. తరచూ ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారని రేవంత్ ప్రశ్నిం చారు. ‘కాంగ్రెస్ కార్యాలయం ఢిల్లీలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఢిల్లీలోనే నిర్ణయించా రు. అందుకే మాకు ఢిల్లీ ఇష్టం. ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గతంలో అన్నారు. ఇప్పుడు వారి ఎంపీలను పార్లమెంటుకు ఎందుకు పంపుతున్నారు. తన ఫాం హౌస్‌లోనే పార్లమెంటు కట్టుకోవచ్చు కదా’ అని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో మొహం చెల్లకే కేసీఆర్ హైదరాబాద్‌లో సభ పెట్టి చీకట్లో వచ్చి ప్రసంగించి వెళ్లారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment