
సాక్షి, అమరావతి: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలి నుంచి మంగళగిరిలో లోకేశ్ ప్రచారానికి ఆశించిన మేర స్పందన రావడం లేదు. టీడీపీ పెద్ద ఎత్తున హడావుడి చేసినప్పటికీ.. లోకేశ్ ప్రచారంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. తాజగా ఉండవల్లిలో నారా లోకేశ్‌కు చేదు అనుభవనం ఎదురైంది. ప్రచారం నిర్వహిస్తున్న లోకేశ్‌ను ఓ మహిళ నిలదీసింది. భూ సేకరణలో తమ పొలాలు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. ఇళ్లు కూడా లాక్కోవడానికి టీడీపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ మహిళకు సమాధానం చెప్పలేక లోకేశ్ అక్కడి నుంచి వెనుదిరిగారు. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తున్నా లోకేశ్‌కు ఇలాంటి అనుభవాలు ఎదురుకావడంతో ఆయన విజయంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment