‘2200 ఎకరాల భూమి కబ్జాకు ప్లాన్‌’ | TDP Planned Steal Forest Lands Says YSRCP Leader Kakani | Sakshi
Sakshi News home page

‘2200 ఎకరాల భూమి కబ్జాకు ప్లాన్‌’

Published Tue, Apr 24 2018 1:32 PM | Last Updated on Tue, Oct 30 2018 6:08 PM

TDP Planned Steal Forest Lands Says YSRCP Leader Kakani - Sakshi

సాక్షి, పొట్టి శ్రీరాములు నెల్లూరు : 2,200 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు తెలుగుదేశం పార్టీ మంత్రి సోమిరెడ్డి ప్లాన్‌ చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయని అన్నారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మొక్క మొలవని భూములను ఇచ్చి మైనింగ్‌ భూములను కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే మూడు గనుల్లో మైనింగ్‌ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. ఈ భూ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement