మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పక్కన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): నిత్యం అవినీతి, అక్రమ సంపాదనే అజెండాగా పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంస్కారం గురించి మాట్లాడటం సిగ్గుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. నాలుగు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయ డం సిగ్గుచేటని విమర్శించారు. సొంత పార్టీలోని కార్యకర్తలను దూషిస్తూ తన్నడానికి వెళ్లిన సోమిరెడ్డి సంస్కారం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతో పట్టు పంచెలు
కొందరు మిల్లర్లు ఇచ్చిన ముడుపులతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పట్టుపంచెలు కొనుక్కొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు మాత్రం పండిన పంటకు ధరల్లేక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. పొదలకూరులోని షాదీమంజిల్లో రాజకీయాలు చేద్దామని వెళ్లిన మంత్రి సోమిరెడ్డికి మైనార్టీలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తాను జెడ్పీ చైర్మన్‌గా చేసిన అభివృద్ధి.. మంత్రిగా ఆయన ఎన్ని పనులు చేశారనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమానని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న ప్రథమ ముద్దాయి చంద్రబాబు అని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా నిరసనలు, దీక్షలు, ధర్నాలతో జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. హోదాకు మద్దతు పలికిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేయడం, దానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాలేదని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు.
మాఫియా గ్యాంగ్‌కు అధ్యక్షుడు బీద రవిచంద్ర
జిల్లాలో మాఫియా గ్యాంగ్‌కు అధ్యక్షుడిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వ్యవహరిస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో రూ.400 కోట్లను బీద రవిచంద్ర దోచుకున్నారని ఆరోపించారు. ఆయన వల్ల కావలి తీర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కావలిలో బీద మస్తాన్‌రావుకు దిక్కులేదని, కనీసం బీదా రవిచంద్ర తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలోనే రవిచంద్ర దోచుకున్న అక్రమ సంపాదనను బయటకు తెస్తామన్నారు. ఇప్పటికైనా రవిచంద్ర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చేస్తున్న అ వినీతిని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తున్నారని, టీడీపీ ఎంపీలకు రాజీనామాలు చేసే ధైర్యం ఉందానని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆడుతున్న దొంగ నాట కాలను ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. వెంకటాచలం జెడ్పీటీసీ మం దల వెంకటశేషయ్య, బీసీ వి భాగ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, నాయకుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment