
ఒంగోలు సబర్బన్ : అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ కూడలిలో ఆ పార్టీ నాయకులు రోడ్డు బ్లాక్ చేసి మరీ ప్రచార సభ ఏర్పాటు చేశారు. భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటోలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కారు.
రోడ్డుపై స్టేజీ కట్టడమే కాకుండా కుర్చీలు వేసి, పాట కచేరీలతో వాహనచోదకులకు, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు. ట్రాఫిక్‌ను పోలీసులు దగ్గరుండి మరీ వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తూ స్వామి భక్తిని చాటుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ట్రంకు రోడ్డులో వేదిక నిర్వహణకు, మైక్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులే దగ్గరుండి మరీ కొనసాగేవిధంగా సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment