
సాక్షి, ఖమ్మం : సత్తుపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ ఓటమిపై అందరికంటే తనకే ఎక్కువ బాధగా ఉందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని అనేక సార్లు సూచించినా.. కొంత మంది పట్టించుకోలేదని తెలిపారు. మూడు సంవత్సరాల్లో 30 సంవత్సరాల అభివృద్ది చేసి చూపించామన్నారు. అభివృద్ది అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ సమావేశం రసాభాస
సాక్షి, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి విజయ రమణారావు.. డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయంను దూషించిచటంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షున్ని విమర్శించిన విజయ రమణారావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment