29న చంద్రశేఖర్ ఆస్పత్రిలో చేరినట్లు రిపోర్టు, ఎఫ్‌ఐఆర్ కాపీ, గుండెపోటుతో మరణించాడని తెలిపే ఆస్పత్రి రికార్డు
ధర్మవరానికి చెందిన చేనేత కార్మి కుడు చంద్రశేఖర్ (63) (అడ్మిషన్ నెంబర్ ఆర్‌ఎంఎల్‌సీ 17562) గత నెల 29న రాత్రి 9.22 గంటలకు అనంతపురం సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ నెల 5న మధ్యాహ్నం 2.30 గంటలకు గుండెపోటుతో (మాసివ్ మయోకార్డినల్ ఇఫాక్షన్) మృతి చెందాడు. ఇది ఆస్పత్రి రికార్డుల్లో నమోదైనా వివరాలు.
చేనేత కార్మికుడు చంద్రశేఖర్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంపేశాయని ఈ నెల 8న ఓ పత్రికలో ప్రచురితమైంది. వాస్తవంగా చంద్రశేఖర్ గాయపడి మృతి చెందలేదని, ఆయనకు మాసివ్ హార్ట్ ఎటాక్ రావడంతోనే చనిపోయారని ఆర్థో వైద్యులు రికార్డుల్లో నమోదు చేశారు.
అనంతపురం న్యూసిటీ : తెలుగుదేశం పార్టీ నాయకులు శవాలపై ఓట్లు ఏరుకునే నీచస్థాయికి దిగారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత కార్మికుడు గుండెపోటుతో మరణిస్తే దాన్ని హత్యగా చిత్రీకరించి వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు కుయుక్తులకు పాల్పడుతున్నారు.
ఇదీ సంగతి : ధర్మవరం జోగినికుంటకు చెందిన చంద్రశేఖర్ (63) గత నెల 29న రాత్రి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ వార్డులో పరీక్షించిన వైద్యులు ఆర్‌ఎంఎల్‌సీ కింద రిజిస్టర్ చేసి ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. మరుసటి రోజు పరీక్షించిన వైద్యులు రైట్ ఫీమర్ నెక్‌గా గుర్తించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు చంద్రశేఖర్‌ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆర్థో ఆపరేషన్ థియేటర్ (12.15 గంటల సమయం)లో ఆర్థో వార్డుకు తరలించేందుకు చంద్రశేఖర్‌ను ఎంఎన్‌ఓ పట్టుకున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా చంద్రశేఖర్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వైద్యులు తక్షణమే స్పందించి ఫిజీషియన్‌కి సమాచారం ఇచ్చారు. ఫిజీషియన్ వచ్చి పరిశీలించినా ఎటువంటి స్పందనా రాలేదు. అప్పటికప్పుడు అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ)కి తరలించి వెంటిలేటర్ మీద వైద్యం అందించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు
చేనేత కార్మికుడి మృతికి నిజంగా తమ కార్యకర్తలే కారణమయితే 29వ తేదిన మొడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదని వైఎస్సార్‌సీపీ ధర్మావరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. చంద్రశేఖర్ గుడెపోటుతో మృతి చెందినట్లు వైద్యులే నిర్ధారించారన్నారు. టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చేనేత కార్మికులు అండగా ఉండటాన్ని సూరీ జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలని కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరోకోమని హెచ్చరించారు.

Comments
Please login to add a commentAdd a comment