
సాక్షి, బెంగళూరు : ఎట్టకేలకు దక్షినాదిలో కోల్పోయిన కర్ణాటక రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మరో ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసింది. తమ ప్రచార అభ్యర్థుల్లో కీలకవ్యక్తి అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రంగంలోకి దింపింది. గురువారం కర్ణాటకలో బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప అధ్యక్షతన జరుగుతున్న పరివర్తన ర్యాలీని సీఎం యోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు దిగుతున్నారన్న ఆయన పోటీ టిప్పు సుల్తాన్‌కు హనుమంతుడికి మధ్య ఉంటుందని తనదైన శైలిలో ప్రచార దాడి మొదలుపెట్టారు. కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, అలాంటిది కాంగ్రెస్ మాత్రం ఆయనను పూజించకుండా గత రెండేళ్లుగా టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతుందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర పోరాటయోధుడని అంటోందని అలాంటి కాంగ్రెస్‌ను హనుమంతుడు ఇక ఓడిస్తాడని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నా సిద్దరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment