
సాక్షి, అమరావతి : ఉద్యోగాలేవి అని అడిగిన వారిని చంద్రబాబు బెదిరించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపాడ్డారు. ఏపీలో ఉద్యోగాల గురించి పట్టించుకోని చంద్రబాబు.. తెలంగాణలో మాత్రం లేని పోని కోతలు కోశారంటూ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్టర్‌లో స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసం ఏపీ ప్రభుత్వం తరఫున చంద్రబాబు భారీ ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. ఇళ్లు కట్టాం, పరిశ్రమలు పెట్టాం.. అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ బాబు లేని పోని కోతలు కోశారన్నారు. కానీ నిన్న తిరుపతిలో మా ఉద్యోగాలేవి అని అడిగిన డీయస్సీ అభ్యర్థులతో మాత్రం ‘తమాషాగా ఉంది మీకు.. నిరుద్యోగుల ఒక్కరి కోసం పని చేయడానికి మేం సిద్ధంగా లేము. తమాషా ఆటలు అడకండి.. బీ కేర్ఫుల్ అంటూ విరుచుకుపడ్డారు’ ఎంతటి దుర్మార్గం అంటూ ట్వీట్ చేశారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2018