
ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒంగోలు వైఎస్సార్‌సీసీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కొన్నిరోజులుగా వైవీ, పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో మాట్లాడుతూ..ఏపీలోని 13 జిల్లాల్లో అత్యంత వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లాయేనని, ప్రకాశం జిల్లా ఎప్పుడూ కరువు కాటకాలతో విజయతాండవం ఆడుతుందని వ్యాఖ్యానించారు.
నాలుగు నెలల్లో 3.5 కిలోమీటర్ల సొరంగం పూర్తి అవుతుందా అని సీఎం చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. సంక్రాంతికి నీళ్లు ఇస్తానని చెప్పడం ప్రజలను బాబు మోసం చేయడమేనని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బాగుంటేనే రాష్ర్టం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment