వైరల్‌: చంద్రుడు ఐయామ్‌ కమింగ్‌ | Owaisi Is Warning to Chandrababu Naidu Viral in Internet | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 10:28 AM | Last Updated on Sat, Dec 15 2018 10:47 AM

Owaisi Is Warning to Chandrababu Naidu Viral in Internet - Sakshi

అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘ఔర్‌ మిష్టర్‌ చంద్రుడూ.. నీ గురించి మరిచిపోయా.. చంద్రుడూ ఐయామ్‌ కమింగ్‌ టూ ఆంధ్రప్రదేశ్‌.. సిద్దంగా ఉండూ’’  అంటూ  సినిమాటిక్‌ స్టైల్‌లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పిన డైలాగ్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆకట్టుకునేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు తమ టెక్నాలజీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వైరల్‌ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎంఐఎం.. హైదరాబాద్‌ దారుస్సలాం ఆవరణలో గత బుధవారం విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ సభలో ఒవైసీ వైవిధ్యంగా ప్రసంగిస్తూ ఆకట్టుకున్నారు. 

‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తావా? ఏపీకి వస్తా.. టీడీపీకి వ్యతిరేకంగా, మిత్రుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తా. మా తడాఖా ఏమిటో చూపిస్తా.’’  అని చంద్రబాబును హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. సొంత రాష్ట్రంలోనే బాబుకు వ్యతిరేకత ఉందని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా టీడీపీ గెలుచుకోలేదని ఒవైసీ జోస్యం చెప్పారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన 8 స్థానాల్లో ఎంఐఎం ఏడింటిని గెలిచిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement