సంబరాలు ఇలా కూడా చేసుకుంటారా? | Venezuela Striker Eduard Bello Celebrates Goal By Proposing To Girlfriend | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 8:51 AM | Last Updated on Wed, Oct 31 2018 8:51 AM

 Venezuela Striker Eduard Bello Celebrates Goal By Proposing To Girlfriend - Sakshi

కరాకస్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు సెంచరీ సాధించిన అనంతరం బ్యాట్‌తో వారి సతీమణులకు ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తూ సంబరాలు చేసుకోవడం చూశాం. కానీ వెనిజులా ఫుటాబాల్‌ ఆటగాడు గోల్‌ చేసిన అనంతరం చేసుకున్న సంబరాలు ఎక్కడా చూసుండరు. గోల్‌కొట్టిన ఆనందంలో అతను తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. అంతేకాకుండా ముద్దులతో ఆమె చెంపలను తడిపేసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సీడీ అంటోఫగస్తా జట్టుకు చెందిన ఎడ్వర్డ్ బెల్లో చీల్స్‌ ఈవెర్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గోల్‌ సాధించాడు.

ఈ ఆనందంలో కోచ్‌ బృందం నుంచి రింగ్‌ అందుకోని సరాసరిగా గ్యాలరీలోని తన ప్రియురాలి వద్దకు పరుగెత్తాడు. ఆమె వేలికి రింగు పెట్టి ప్రపోజ్‌ చేశాడు. దీనికి ఒప్పుకోవడంతో ఆమె చెంపలను ముద్దులతో తడిపాడు. ఇక గ్యాలరీలో ఉన్న మిగతా ప్రేక్షకులు ఈ ఆకస్మిక ఘటనకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ జంటను చప్పట్లతో అభినందించారు. అయితే ఈ మ్యాచ్‌లో బెల్లో జట్టు 2-3 తేడాతో ఓటమి పాలైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement