
సెంచూరియన్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తన తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సాహా స్థానంలో పార్థీవ్ పటేల్, శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మకు చోటు దక్కింది. కాగా గాయం కారణంగా ఈ రెండో టెస్ట్‌కు కూడా స్టెయిన్ దూరంగా ఉన్నాడు. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో సఫారీలు 1-0 తో ఆధిక్యంలో ఉన్నారు.
జట్లు
భారత్: రాహుల్, విజయ్, పుజారా, కోహ్లి (కెప్టెన్), ఆర్‌జీ శర్మ, పాండ్యా, పార్ధీవ్ పటేల్, ఆర్ అశ్విన్, షమీ, బుమ్రా, ఇషాంత్ శర్మ.
దక్షిణాఫ్రికా: ఎల్గర్, మార్క్‌రమ్, ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్ (కెప్టెన్), డికాక్, ఫిలాండర్, క్రిస్ మోరిస్, కేశవ్ మహరాజ్, రబడ, మోర్నీ మోర్కెల్
Comments
Please login to add a commentAdd a comment