మరో మూడేళ్లలో రష్యాలో జరిగే 2018 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా జోన్ క్వాలిఫయింగ్
2018 ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్
న్యూఢిల్లీ: మరో మూడేళ్లలో రష్యాలో జరిగే 2018 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా జోన్ క్వాలిఫయింగ్ ‘డ్రా’ విడుదలైంది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రెండో దశ ‘డ్రా’ను తీశారు. గ్రూప్ ‘డి’లో పటిష్ట జట్లయిన ఇరాన్, ఒమన్, గ్వామ్, తుర్క్‌మెనిస్థాన్‌ల సరసన భారత్‌కు చోటు దక్కింది. ఈ నాలుగు జట్లతో భారత్ ఇంటా, బయటా పద్ధతిలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ పోటీలు ఈ ఏడాది జూన్ 11 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు జరుగుతాయి. మొత్తం ఎనిమిది గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు, ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లు ఫైనల్ క్వాలిఫయింగ్‌కు అర్హత సాధిస్తాయి.