మళ్లీ రెండో ర్యాంక్‌కు సైనా
న్యూఢిల్లీ : గత వారం ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గురువారం తాజాగా ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె రెండో స్థానానికి పడిపోయింది. మలేసియా ఓపెన్ సెమీఫైనల్లో ఓడిపోవడంతో సైనా తన ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా నంబర్‌వన్ స్థానం ఒక వారానికే పరిమితమైంది. సైనాను ఓడించిన లీ జురుయ్ (చైనా) ఇప్పుడు అగ్రస్థానం అందుకుంది.
మరో భారత క్రీడాకారిణి పీవీ సింధు తన 9వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ కూడా 4వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ (14) ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేకపోగా, పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానంలో నిలిచాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి ఒక స్థానం మెరుగుపర్చుకొని 18వ ర్యాంక్‌లో నిలిచింది.
ఏడు రోజుల ముచ్చట!
Published Fri, Apr 10 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM
Advertisement
Advertisement