స్టావెంజర్ (నార్వే): భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. నార్వే చెస్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. తెల్లపావులతో ఆడిన విషీ ఆరంభంలో అద్భుతమైన ఎత్తులు వేసినా.. బెర్లిన్ డిఫెన్స్‌తో కరుణ (ఇటలీ) సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో 37 ఎత్తుల వద్ద గేమ్ డ్రాగా ముగిసింది. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు టోర్నీ జరుగుతుంది. ఇతర గేమ్‌ల్లో నకమురా (అమెరికా)... లుడ్విగ్ హమ్మర్ (నార్వే)పై; వచియర్ లాగ్రావీ (ఫ్రాన్స్)... అరోనియన్ (ఆర్మేనియా)పై; అనిష్ గిరి (నెదర్లాండ్స్)... గ్రిస్చుక్ (రష్యా)పై; తపలోవ్ (బల్గేరియా)... కార్ల్‌సెన్ (నార్వే)పై నెగ్గారు.
ఆనంద్ తొలి గేమ్ డ్రా
Published Thu, Jun 18 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement