
సచిన్‌తో కలిసి ‘సచిన్’ను...
అతని స్ఫూర్తిగా క్రికెట్‌లోకి అడుగు పెట్టినవారు... అతనితో కలిసి ఆడినవారు... ఆత్మీయులు, సన్నిహితులు... ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది. భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరే ముందు సచిన్ తన బయోపిక్ ‘సచిన్–ఎ బిలియన్ డ్రీమ్స్’ను ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. తమకు పెద్దన్నలాంటి క్రికెట్ దేవుడి సినిమాను జట్టు మొత్తం ఉత్సాహంగా తిలకించింది.