
చెస్టర్ లి స్ట్రీట్: వరుసగా నాలుగో వన్డేలోనూ ఆస్ట్రేలియాపై ఆతిథ్య ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 3–0తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్ నామమాత్రమైన నాలుగో మ్యాచ్‌లోనూ జోరు కనబర్చింది. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (106 బంతుల్లో 100; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షాన్ మార్‡్ష (92 బంతుల్లో 101; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు.
హెడ్ (63; 9 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లీకి 4, వుడ్, ఆదిల్ రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకుపోతోంది. కడపటి వార్తలు అందేసరికి 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 146 పరుగులు చేసింది. ఓపెనర్లు రాయ్ (84; 11 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (61; 9 ఫోర్లు) అదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment