న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ సన్మానించనుంది. ఈ మేరకు బోర్డు అధికారికంగా ఢిల్లీ క్రికెట్ సంఘానికి (డీడీసీఏ)కు ఈ మెయిల్ పంపింది గురువారం ఉదయం 9 గంటలకు ఈ సన్మానం జరగనుంది. అయితే ఆశ్చర్యకరంగా డీడీసీఏ ఈ కార్యమ్రానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ‘వీరూ సన్మానం గురించి బీసీసీఐ నుంచి మెయిల్ వచ్చింది. అధ్యక్షుడు, లేదా కార్యదర్శి ఎవరూ సన్మానిస్తారో మాకు తెలియదు. డీడీసీఏ మాత్రం ఇందులో భాగం పంచుకోదు. ఎందుకంటే బోర్డు మాకు చాలా తక్కువ సమయం ఇచ్చింది. మేం సిద్ధం కావడానికి ఇది సరిపోదు. ఢిల్లీకి ఎనలేని సేవలందించిన సెహ్వాగ్‌ను మరోసారి ఘనంగా సత్కరిస్తాం’ అని డీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతన్ చౌహన్ వెల్లడించారు.
సెహ్వాగ్‌కు బీసీసీఐ సన్మానం
Published Wed, Dec 2 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
Advertisement