రియో డి జనీరో: ఒలింపిక్స్ టిక్కెట్లను అక్రమ పద్దతిలో అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఉన్నతాధికారి ప్యాట్రిక్ హికేను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూరోపియన్ ఒలింపిక్ కమిటీ చీఫ్ కూడా అయిన 71 ఏళ్ల హికేను ఇక్కడి ఓ లగ్జరీ హోటల్‌లో అరెస్ట్ చేయగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒలింపిక్స్‌లో జరిగే ముఖ్య పోటీల పోటీల టిక్కెట్లను అక్రమ పద్దతిలో అమ్ముతున్న కేసులో మరో ఆరుగురు కూడా దోషులుగా ఉన్నారు. 2012 నుంచి హికే ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌లో సభ్యులుగా ఉంటున్నారు. తమ పరిశోధనలో హికేకు అంతర్జాతీయ బ్లాక్ టిక్కెట్ అమ్మకాల్లో పాత్ర ఉన్నట్టు తేలిందని రియో పోలీస్ ఫ్రాడ్ యూనిట్ పేర్కొంది. ఒలింపిక్ నిర్వాహకులు నిర్ణయించిన ధరకన్నా అధిక మొత్తానికి ఈ గ్యాంగ్ టిక్కెట్లను అమ్ముకుంటోందని పోలీసులు ఆరోపించారు.
రష్యా 4x100మీ. స్వర్ణం వెనక్కి..
డోపింగ్ భూతం రష్యాను ఇంకా వీడడం లేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మహిళల 4ఁ100మీ. రిలేలో సాధించిన స్వర్ణాన్ని తాజాగా వెనక్కి తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పేర్కొంది. జట్టు సభ్యురాలు యూలియా చెర్మోషాన్‌స్కయా డోపింగ్ రీటెస్టులో విఫలం కావడమే దీనికి కారణం. అప్పట్లో ఇచ్చిన శాంపిల్స్‌ను తిరిగి అధునాతన పద్దతిలో పరీక్షించాక తను రెండు నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకున్నట్టు తేలింది. దీంతో రెండో స్థానంలో వచ్చిన బెల్జియం జట్టుకు స్వర్ణం దక్కుతుంది.
బ్లాక్ టిక్కెట్ కేసులో ఐఓసీ సభ్యుని అరెస్ట్
Published Thu, Aug 18 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
Advertisement