
వరల్డ్ కప్ నాటికి ఫించ్ సిద్ధం!
త్వరలో భారత్లో ప్రారంభం కాబోయే వరల్డ్ ట్వంటీ 20 ట్రోఫీకి ముందుగానే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కోలుకుంటాడని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.
మెల్బోర్న్:త్వరలో భారత్లో ప్రారంభం కాబోయే వరల్డ్ ట్వంటీ 20 ట్రోఫీకి ముందుగానే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కోలుకుంటాడని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా) సోమవారం ఫించ్ ఫిట్ నెస్కు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ తో రెండో టీ 20 సందర్భంగా వికెట్ల మధ్య పరుగెడుతుండగా ఫించ్ ఎడమ కాలి తొడ కండరాలు పట్టేయడంతో అతనికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని తెలిపింది.
గతేడాది ఫించ్ ఇదే గాయంతో బాధపడినప్పుడు సర్జరీ అవసరమైనా, ప్రస్తుత గాయానికి ఏ విధమైన సర్జరీలు అవసరం లేదని పేర్కొంది. అయినప్పటికీ మరికొద్ది వారాల్లో టీ 20 వరల్డ్ కప్ ఆసీస్ ఆటగాళ్ల పునరావస కార్యక్రమంలో ఫించ్ ఫిట్నెస్ పరిక్షీస్తామని సీఏ స్పష్టం చేసింది.