చెన్నై : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చెన్నైసూపర్ కింగ్స్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం దాదాపు 8నెలలు మైదానానికి దూరమైన మహీ ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు చాంపియన్‌గా నిలపడమే గాక 2010,14లో చాంపియన్ లీగ్ టైటిల్‌ను కూడా సాధించిపెట్టాడు.ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. ఈ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడాడు. ('కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది')
'2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో నా ప్రయాణం మొదలైంది.నేను ఒక క్రికెటర్‌గా మరింత మెరుగవడానికి ఎంతో సహాయపడింది.క్రికెటర్‌గా, ఒక వ్యక్తిగా అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పడు చెన్నై ఫ్రాంచైజీ నాకు అండగా నిలిచింది. ఇక చెన్నై ఫ్యాన్స్ నన్ను 'తాళ' అని పిలుస్తుంటారు. తాళ అంటే సోదరుడని అర్ధం. అభిమానులకు నాపై ఉన్న ప్రేమకు కృతజ్ఞతలు. తాళ అని పిలిచారంటే వారు కచ్చితంగా చెన్నై అభిమానులే అయ్యుంటారు.అది నాపై వారికున్న ప్రేమ, గౌరవం' అని చెప్పుకొచ్చాడు. కాగా ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో 190 మ్యాచులాడి 4432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
(మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా)
Comments
Please login to add a commentAdd a comment