
హరికృష్ణకు మరో ‘డ్రా’
నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీలో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. పావెల్ ఎల్జనోవ్ (ఉక్రెయిన్)తో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 42 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.