
చెన్నై పై ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం
ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి చెన్నైతో జరిగన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
రాయ్పూర్: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి చెన్నైతో జరిగన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది.ఆ తర్వాత అయ్యర్(70), యువరాజ్(32) పరుగుల సహాయంతో ఢిల్లీ సునాయాసంగా గెలుపొందింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లుగా దిగిన మెకల్లమ్ (11), డ్వేన్ స్మిత్ (18) పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత వచ్చిన మిగతా ఆటగాళ్లు రైనా (11), డుప్లెసిస్(29), బ్రేవో(8), ధోనీ(27)లు పరుగులు చేసి అవుట్ అయ్యారు. పవన్(5), జడేజా (3) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లు జహీర్, మెర్కెల్ లు తలా రెండు వికెట్లు తీయగా సంధూ,జయంత్ లు తలో వికెట్ తీశారు..
120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఆదిలోనే డికాక్(3), డుమిని(6) ఔటయ్యారు. తర్వత బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్, అయ్యర్తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువరాజ్ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటవగా, ఆ తర్వత వచ్చిన మోర్కెల్(8) అవుటయ్యాడు. అయ్యర్ (70), జాదవ్(1) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన జహీర్ ఖాన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.