ముంబై: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని పక్కక పెట్టడంతో విమర్శలు జోరందుకున్నాయి. అసలు ఎంఎస్‌ను కావాలనే తప్పించారా.. లేక అతనే తప్పుకున్నాడా అనే దానిపై విపరీతమైన చర్చ నడిసింది. త్వరలో ఎంఎస్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని, అందుకోసమే జట్టులో ఎంపిక చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సెగ టీమిండియా సెలక్షన్ కమిటీకి గట్టిగా తాకినట్టు ఉంది. దీనిపై అందులోని సభ్యుడొకరు వెంటనే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
‘ ధోని లాంటి దిగ్గజాన్ని మేము పక్కకు పెట్టడమా. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ధోనిని కావాలని తప్పించలేదు. అతనే తప్పుకున్నాడు. ఎంఎస్ ధోనినే మాకు టైమ్ ఇచ్చాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్ నాటికి జట్టు సన్నాహకాల్లో భాగంగా ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు. యువ క‍్రికెటర్లతో జట్టును పరీక్షించమని మాకే ఎంఎస్ సమయం ఇచ్చాడు. జట్టు ప్రయోజనాలే ధోనికి ముఖ్యం. నిజానికి పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్‌కు గాయమైతే మాకు సరైన ప్రత్యామ్నాయ కీపర్ లేడు. అందుకే ధోని ఆగిపోయాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అతడి పాత్ర ఏమిటనే విషయంలో ఇంకా చర్చించలేదు.
అయితే భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టాల్సిందిగా తనే మాకు టైమ్ ఇచ్చా డు. ధోని తర్వాత ఏమిటనే దానిపై నిజంగా మా కింకా స్పష్టత లేదు. అతడిలాంటి ఫినిషర్ కూడా మాకింకా దొరకలేదు. 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ఆటగాడిని చాలా తేలిగ్గా విమర్శిస్తున్నారు. అసలు తాను జీవితకాలంలో చూసిన మ్యా చ్‌లకన్నా ఎక్కు వ విజయాలను ధోని అందించాడు’ అని సదరు సెలక్టర్ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment