టాప్ స్కీమ్‌లో చేర్చడంపై క్రీడాశాఖ వ్యాఖ్య
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్వినిలను టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) స్కీమ్‌లో చేర్చడాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 21న జరిగిన ఐడెంటిఫికేషన్ కమిటీ సమావేశంలోనే వాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. ‘ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత వీళ్ల ప్రదర్శన గురించి చర్చించింది. చర్చ తర్వాత ఈ ఇద్దర్ని స్కీమ్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
డబుల్స్‌లో వీళ్లిదరికి కలిపి శిక్షణ ఇప్పించాలని కమిటీ భావించింది’ అని క్రీడా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లను టాప్‌కి ఎంపిక చేయగానే... జ్వాల, అశ్విని క్రీడాశాఖపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
జ్వాల, అశ్వినిలను తిరస్కరించలేదు
Published Sat, May 30 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement