
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అంశం నుంచి భారత క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు విముక్తి లభించింది. అతను కాన్‌ఫ్లిక్ట్ పరిధిలోకి రాడంటూ గురువారం బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ స్పష్టతనిచ్చారు.
ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు లోబడి ఉన్నాడని నిరూపించే ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో, నియమాలకు వ్యతిరేకంగా నమోదైన ఈ ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment