ఎనిమిదో గేమ్ కూడా డ్రా అయినా... నా ఉద్దేశంలో ఇది చాలా బోరింగ్. ఆనంద్ ఆశ్చర్యకరంగా నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను మొదలుపెట్టాడు. చివరకు 33 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రాధాన్యమిచ్చారు. గేమ్ డ్రా అవుతుందని ప్రారంభలోనే స్పష్టమైంది. ప్రతి ఎత్తు వద్ద పావులు చేతులు మారాయి.
చివరకు ఒక్కొక్కరి దగ్గర కింగ్, ఏడు పాన్‌లు మిగిలాయి. కాబట్టి గేమ్ ముందుకెళ్లినా ఎలాంటి పురోగతి కనిపించదు. కార్ల్‌సెన్ పరంగా ఆలోచిస్తే ఇది మంచి ఫలితమే. ఎందుకంటే అతను ఇప్పటికే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా... మరో నాలుగు గేమ్‌లు ఆడాల్సి ఉంది. ఈ గేమ్‌లో ఆనంద్ ఓపెనింగ్‌కు నేను ఆశ్చర్యపోయా. గెలిచేందుకు కావాల్సిన అవకాశాలను ఈ ఓపెనింగ్ సమకూరుస్తుంది. బెర్లిన్ డిఫెన్స్ పటిష్టమైన ఓపెనింగ్. ఒకవేళ తెల్లపావులతో ఆడితే అది రక్షణాత్మకం అవుతుంది.
అప్పుడు డ్రా చేసుకోవడం తప్ప నల్లపావులతో ఇంకేమీ చేయలేం. ప్రస్తుతం కార్ల్‌సెన్ 5-3తో ఆధిక్యంలో ఉన్నాడు. తొమ్మిదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో విషీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. తెల్లపావులతో మరో డ్రా చేసుకోవడం సరైందికాదు. కార్ల్‌సెన్‌ను ఓడించాలంటే దూకుడుగా ఆడటంతో పాటు రిస్క్ కూడా తీసుకోవాల్సిందే. నేడు విశ్రాంతి దినం. తర్వాతి గేమ్‌లో ఆనంద్ వ్యూహాన్ని మార్చి గెలుపే లక్ష్యంగా ఆడతాడని నా నమ్మకం.
రిస్క్ తీసుకోవాల్సిందే!
Published Wed, Nov 20 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement