
ఫెడరర్ తెలివైనవాడు
జొకోవిచ్
పారిస్: స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తెలివైన ఆటగాడని ప్రపంచ నంబర్–2 ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ చెప్పుకొచ్చాడు. ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి మాజీ నంబర్‌వన్ రోజర్ తప్పుకోవడంపై అతను మాట్లాడుతూ ‘తనకు కష్టమైన క్లేకోర్టును కాదని గ్రాస్ కోర్టుల్లో మరిన్ని విజయాలు సాధించేందుకే ఫెడరర్ రోలండ్ గారోస్ నుంచి వైదొలిగాడు’ అని అన్నాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ సహా ఇతర గ్రాస్ కోర్టుల్లో టైటిల్స్ సాధించాలనే లక్ష్యంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని సెర్బియన్ స్టార్ జొకోవిచ్ చెప్పాడు.
‘మైదానంలోనే కాదు తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ రోజర్ దిట్ట. తను ఏంచేస్తున్నాడో అతనికి బాగా తెలుసు. అందుకే తనకు తిరుగులేని గ్రాస్‌కోర్టు ఈవెంట్స్ కోసం క్లేకోర్టును కాదనుకున్నాడు’ అని జొకోవిచ్ పేర్కొన్నాడు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌ను మాత్రం ఒకే ఒక్కసారి గెలిచాడు. 35 ఏళ్ల ఫెడరర్ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. జూలై 3 నుంచి జరగనున్న వింబుల్డన్ ఈవెంట్ కోసం ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాడు. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అతను ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు.