కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ క్లీన్‌స్వీప్ | Freestyle wrestlers win 14 medals at Commonwealth Championships | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ క్లీన్‌స్వీప్

Published Tue, Dec 10 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ క్లీన్‌స్వీప్

కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ క్లీన్‌స్వీప్

న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ పోటీల్లోని గ్రీకో రోమన్ కేటగిరిలో అందుబాటులో ఉన్న ఏడు స్వర్ణ పతకాలనూ సొంతం చేసుకొని టీమ్ చాంపియన్‌షిప్‌ను సాధించారు.

గౌరవ్ శర్మ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), ఆనంద్ (66 కేజీలు), రాజ్‌బీర్ చికారా (74 కేజీలు), మనోజ్ (84 కేజీలు), హర్‌దీప్ (96 కేజీలు), నవీన్ (120 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు.  మహిళల విభాగంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.  పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ భారత్‌కు టీమ్ టైటిల్ దక్కింది. ఓవరాల్‌గా భారత్‌కు  38 పతకాలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement