బంతితో మెరిసిన కృణాల్
రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఎంచుకున్న గుజరాత్ లయన్స్ మెకల్లమ్(6)వికెట్ ను తొందరగా కోల్పోయింది. ఆపై స్వల్ప వ్యవధిలో సురేశ్ రైనా(1), అరోన్ ఫించ్(0), దినేశ్ కార్తీక్(2) లు కూడా నిష్ర్కమించడంతో ఆరంభంలోనే గుజరాత్ తడబడింది. అయితే ఇషాన్ కిషాన్(48;35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడి పరిస్థితిని చక్కదిద్దాడు.
ఇక మధ్య ఓవర్లలో రవీంద్ర జడేజా(28),ఫాల్కనర్(21), ఆండ్రూ టై(25)లు బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృణాల్ పాండ్యా మెరిశాడు. నాలుగు ఓవర్లలో 14 పరుగులిచ్చి మూడు వికెట్ల సాధించాడు. అతనికి జతగా బూమ్రా, మలింగాలు తలో రెండు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ వికెట్ తీశాడు.