
ఇన్ సెట్‌లో హాంకాంగ్ బుమ్రా
బుమ్రా బౌలింగ్‌ను ఫర్‌ఫెక్ట్‌గా కాపీ పేస్ట్ చేశాడు..
హాంకాంగ్ : విభిన్నమైన శైలితో బంతులను సంధించే టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా లిమిటెడ్ ఫార్మెట్ ప్రపంచ నెం1 బౌలర్ అన్న విషయం తెలిసిందే. అప్‌కమింగ్ ఆటగాళ్లకు బుమ్రా.. స్పూర్తిగా నిలుస్తున్నాడనే విషయంలో అతిశయోక్తి లేదు. అతని విభిన్నమైన శైలిని అనుకరించడం చాలా కష్టం. వైవిధ్యమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే బుమ్రా.. భారత బౌలింగ్ విభాగంలో కీలకమయ్యాడు. అయితే అతని బౌలింగ్‌ను అనుకరిస్తూ చాలా మంది ప్రయత్నించారు.
ఆ తరహా వీడియోలు నెట్టింట రచ్చ కూడా చేశాయి. తాజాగా హాంకాంగ్ చెందిన అండర్-13 కుర్ర క్రికెటర్.. బుమ్రా బౌలింగ్‌ను ఫర్‌ఫెక్ట్‌గా కాపీ పేస్ట్ చేశాడు. అదే శైలితో బంతులను సంధించి ఔరా అనిపించాడు. ఈ వీడియోను హాంకాంగ్ క్రికెట్ అధికారిక ట్విటర్‌లో షేర్ చేయగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘ఈ బౌలింగ్ చూస్తుంటే ఎవరో గుర్తుకు వస్తున్నారు.. కదా!’ అనే క్యాప్షన్‌గా పేరొన్న వీడియోకు.. అవును దటీజ్ హాంకాంగ్ బుమ్రా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Spotted in the U-13s League today - another interesting bowling action. Does this remind you of somebody? 🤔@Jaspritbumrah93 @BCCI @ICCMediaComms @ICC #Cricket #HKCricket pic.twitter.com/A8OOfmtfPG
— Hong Kong Cricket (@CricketHK) March 3, 2019