
భారత్ ‘ఎ’ లక్ష్యం 444
నాలుగు రోజుల అనధికార తొలి టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు ముందు దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ప్రస్తుతం 73/2
దక్షిణాఫ్రికా ‘ఎ’తో మ్యాచ్
వాయనాడ్ (కేరళ): నాలుగు రోజుల అనధికార తొలి టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు ముందు దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గురువారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 2 వికెట్లకు 73 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (32 బ్యాటింగ్), రాయుడు (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జీవన్‌జ్యోత్ సింగ్ (1), అంకూష్ బైన్స్ (27) విఫలమయ్యారు. గెలవాలంటే భారత్ మరో 371 పరుగులు చేయాలి.
అంతకుముందు 122/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 66.3 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీ జట్టుకు 338 పరుగుల ఆధిక్యం దక్కింది. రాయుడు (46) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. దీంతో 57 పరుగులకు భారత్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. పిడిట్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హెండ్రిక్స్ (61), వాన్‌జెల్ (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు.