
కేప్‌టౌన్: తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 28 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పొయింది. ధావన్ (16), కోహ్లి (5) , మురళి విజయ్(1)లు అవుట్ కాగా ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(0), పుజారా(5) ఉన్నారు. మెర్కెల్, ఫిలాండర్, స్టెయిన్‌లకు తలో వికెట్ పడింది.
టీమిండియాతో ఇక‍్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 286 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు పూర్తిగా ఆడకుండానే సఫారీలు చాపచుట్టేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక హార్దిక్ పాండ్యా, షమీ, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment