దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ 124(116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. షెజాద్‌కు తోడు మహ్మద్ నబీ 64(56 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్‌కు 253 పరుగుల లక్ష్యం నమోదైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు మంచి శుభారంభం అందింది. షెజాద్ వచ్చిరాగానే భారత యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి అఫ్గాన్ 63 పరుగులు చేసింది. వీటిలో షెజాద్‌వే 60 పరుగులు ఉండటం గమనార్హం.
అనంతరం భారత స్పిన్నర్ జడేజా అప్గాన్ పనిపట్టాడు. అద్భుత బంతితో జావెద్ అహ్మది (5)ని బోల్తాకొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3)ను సైతం జడేజానే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్ అటాక్ చేయడంతో అఫ్గాన్ హస్మతుల్లా(0), కెప్టెన్ అస్గర్(0)ల వికెట్లను వరుసగా కోల్పోయింది. 17 పరుగుల వ్యవదిలోనే అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఓవైపు వికెట్లు పడుతున్న షేజాద్ దాటిగా ఆడుతూ.. 87 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో కెరీర్‌లో 5వ శతకం పూర్తిచేసుకున్నాడు. ఈ తరుణంలో తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న దీపక్ చహర్, నయీబ్(15) వికెట్‌ను పడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీ సైతం ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు.
కష్టంగా మారిన సెంచరీ హీరో షేజాద్ వికెట్‌ను పార్ట్‌టైం బౌలర్ కేదార్ జాదవ్ పడగొట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జద్రాన్(20)ను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. వేగంగా ఆడే క్రమంలో నబీ(64) సైతం క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో రషీద్ ఖాన్(12), అలామ్(2)లు వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడటంతో అప్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా మూడు, కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, చహర్, జాదవ్‌లు తలా ఓ వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment