దాయాదుల పోరు.. భారతే హాట్ ఫెవరెట్..! | India to take on Pakistan in Champions Trophy opener next year | Sakshi
Sakshi News home page

దాయాదుల పోరు.. భారతే హాట్ ఫెవరెట్..!

Published Wed, Jun 1 2016 4:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

దాయాదుల పోరు.. భారతే హాట్ ఫెవరెట్..!

దాయాదుల పోరు.. భారతే హాట్ ఫెవరెట్..!

లండన్: వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్, తమ తొలి పోరులో దాయాది పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. సెప్టెంబర్ 30, 2015 నాటికి ఐసీసీ ర్యాంకుల్లో టాప్ 8 జట్లు ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాకు టాప్ సీడింగ్ లభించగా ఆ జట్టు గ్రూప్ ఏ లో ఉండగా, రెండో సీడింగ్ సాధించిన భారత్ గ్రూప్-బి లో ఉంది. ఆసీస్ తో పాటు గ్రూప్-ఏ లో న్యూజీలాండ్(4), ఇంగ్లండ్(6), బంగ్లాదేశ్(7) లు ఉన్నాయి.

భారత్ తో పాటు దక్షిణాఫ్రికా(3), శ్రీలంక(5), పాకిస్తాన్(8) ఉన్నాయి. జూన్ 1 న ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే దాయాది జట్లు భారత్, పాక్ లు జూన్ 4న తలపడనున్నాయి. తొలి మ్యాచ్ దాయాది జట్టుతో కావడంతో ఇరు జట్లు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. చివరిసారి 2013లో జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 2006 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఈ టోర్నమెంట్లో చోటు దక్కించుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement