ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గవర్నర్-జనరల్స్ ఎలెవన్ తో భారత మహిళలు ఆడాల్సిన ఉన్న ఏకైక ట్వంటీ 20 ప్రాక్టీస్ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు.
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గవర్నర్-జనరల్స్ ఎలెవన్ తో భారత మహిళలు ఆడాల్సిన ఏకైక ట్వంటీ 20 ప్రాక్టీస్ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కొన్ని ఓవర్లు పాటు మాత్రమే సాధ్యమైంది. గవర్నర్-జనరల్ జట్టు 19/1 వద్ద ఉండగా భారీ వర్షం పడటంతో మ్యాచ్ ను నిలిపి వేయక తప్పలేదు. అనంతరం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయి మ్యాచ్ నిర్వహణకు సాధ్య పడలేదు.
ఇరు జట్ల మధ్య మూడు ట్వంటీ 20లు, మూడు వన్డేలు జరుగనున్నాయి. తొలి ట్వంటీ 20 జనవరి 26 వ తేదీన అడిలైడ్ లో, రెండో టీ 20 మెల్ బోర్న్ లో జనవరి 29న, మూడో ట్వంటీ 20 సిడ్నీలో జనవరి 31న జరుగనుంది. ఈ సిరీస్ లో మిథాలీ రాజ్ భారత్ కు సారథ్యం వహిస్తుండగా, ఆల్ రౌండర్ జులాన్ గోస్వామి వైస్ కెప్టెన్ వ్యహరిస్తోంది.