బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ కష్టాల్లో పడింది. అఫ్గానిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 50 పరుగులకే ఐదు వికెట్లు సమర్పించుకుని ఎదురీదుతోంది. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న అఫ్గాన్.. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడుతోంది. షహజాద్ రనౌట్ రూపంలో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. ఆపై స్వల్ప విరామాల్లో జావేద్ అహ్మదీ(1), రహ్మత్ షా(14), అఫ్సర్ జజాయ్(6), అస్గార్ స్టానిక్‌జాయ్(11) వికెట్లను చేజార్చుకుంది. దాంతో 50 పరుగులకే సగం వికెట్లను అఫ్గాన్ కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అఫ్గాన్ కోల్పోయిన ఐదు వికెట్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్‌లు తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ శతకాలు సాధించగా.. లోకేష్ రాహుల్ 54 రన్స్ చేశాడు. రెండో రోజు హార్దిక్ పాండ్య (94 బంతుల్లో 71), ఉమేష్ యాదవ్ (21 బంతుల్లో 26 నాటౌట్) వేగంగా ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment