
సత్తాచాటుతున్న భారత బౌలర్లు
బెంగళూరు: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తాచాటుతున్నారు. పరుగుల వేటలో డివిల్లీర్స్ మినహా ఇతర సౌతాఫ్రికా టాపార్డర్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
డివిల్లీర్స్ అజేయ హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. డివిల్లీర్స్ కు తోడు విలాస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత బౌలర్లు అశ్విన్ మూడు, ఆరోన్, జడేజా చెరో వికెట్ తీశారు. తొలి సెషన్లో మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. లంచ్ విరామం తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్ల జోరు ఇలాగే కొనసాగితే తొలి రోజే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసే అవకాశముంది. ఎల్గర్ (38), డుమనీ (15), వాన్ జిల్ (10), ఆమ్లా (7), డుప్లెసిస్ (0) అవుటయ్యారు.