సఫారీలకు పరీక్ష! | team india got 80 with no losing wickets at first day | Sakshi
Sakshi News home page

సఫారీలకు పరీక్ష!

Published Sat, Nov 14 2015 5:12 PM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

సఫారీలకు పరీక్ష!

సఫారీలకు పరీక్ష!

బెంగళూరు: ఒకపక్క దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపెడితే.. దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం చెమటోడ్చుతున్నారు. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలోఆరంభమైన రెండో టెస్టులో టీమిండియా అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ అదరగొడుతూ ముందుకు సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను 214 పరుగులకే చుట్టేసిన టీమిండియా.. ఆ తరువాత బ్యాటింగ్ లో కూడా సఫారీ బౌలర్లకు  పరీక్షగా నిలిచింది.

 

ఈ రోజు ఆటలో టీమిండియా 22  ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఒక్క వికెట్ ను కూడా దక్షిణాఫ్రికాకు సమర్పించుకోలేదు.  ఓపెనర్ శిఖర్ ధవన్(45 బ్యాటింగ్;62 బంతుల్లో 7ఫోర్లు) ఫామ్ లోకి వచ్చి టీమిండియా ఆందోళనను తొలగించాడు. శిఖర్ తోడుగా మరో ఓపెనర్ మురళీ విజయ్(28) తన దైన శైలితో ఆటను కొనసాగిస్తున్నాడు.  దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 22.0  ఓవర్లలో వికెట్ నష్టపోకుండా  80 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తడబడింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు తమ స్పిన్ తంత్రంతో మరోసారి రాణించి తలో నాలుగు వికెట్లు తీశారు. కాగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో   ఏబీ డివిలియర్స్(85) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. వేన్ జిల్(10), ఎల్గర్(38),డుమనీ (15), ఆమ్లా (7), డుప్లెసిస్ (0), విలాస్(15)లు నిరాశపరిచినా.. వందో టెస్టు ఆడుతున్నడివిలియర్స్ మాత్రం ఒంటరి పోరు సాగించాడు.  
 
ఆ తరువాత రబడా వెంటనే ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికా రెండొందల మార్కును చేరడం కూడా కష్టంగానే అనిపించింది. అయితే కేల్ అబాట్ తో కలిసి మోర్నీ మోర్కెల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. 214 పరుగుల వద్ద మోర్కెల్(22) తొమ్మిదో వికెట్ గా అవుట్ కావడం..  ఆపై వెంటనే అబాట్(14) రనౌట్ గా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement