జీతూ రాయ్‌కు చాంపియన్‌స ట్రోఫీ
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్‌లో చాంపియన్‌స ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇటలీలోని బొలోగ్నాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో పతకాలు గెలిచినవారు మాత్రమే చాంపియన్‌స ట్రోఫీ కోసం పోటీపడతారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లేదా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగాల్లో మాత్రమే ఈ అవార్డు కోసం పోటీలు నిర్వహిస్తారు. జీతూ రాయ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌ను ఎంచుకున్నాడు.
ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తొలి నాలుగు షాట్‌ల తర్వాత అత్యల్ప స్కోరు ఉన్న షూటర్ నిష్ర్కమిస్తాడు. ఆ తర్వాత ప్రతి షాట్‌కూ తక్కువ స్కోరు ఉన్న ఒక్కో షూటర్ తప్పుకుంటాడు. చివరకు బరిలో నిలిచిన ఇద్దరికి ఫైనల్ నిర్వహిస్తారు. ఫైనల్లో ఇద్దరి స్కోర్లు సున్నాగా ఉంటాయి. ఇద్దరికీ మూడు షాట్‌లు కొట్టేందుకు అవకాశం ఇస్తారు. ఫైనల్లో జీతూ రాయ్ 29.6 పాయి0ట్లు స్కోరు చేసి విజేతగా అవతరించగా... దామిర్ మికెక్ (సెర్బియా) 28.3 పాయి0ట్లతో రన్నరప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన జీతూ రాయ్‌కు 5 వేల యూరోలు (రూ. 3 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.