
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ వేలం కార్యక్రమం ఈనెల 18న జైపూర్‌లో జరుగనుంది. వేలంలో పాల్గొనేందుకు 1003 మంది క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 232 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో 70 స్థానాలు ఖాళీగా ఉండగా భారీ ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి.
అత్యధికంగా దక్షిణాఫ్రికా నుంచి 59 మంది, ఆస్ట్రేలియా నుంచి 35 మంది, అఫ్గానిస్తాన్ నుంచి 27 మంది, అమెరికా, హాంకాంగ్, ఐర్లాండ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment