భారత మిక్స్‌డ్ డబుల్స్ జంట ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి
బాసెల్ (స్విట్జర్లాండ్): భారత మిక్స్‌డ్ డబుల్స్ జంట ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 19–21, 17–21తో చైనా జంట జాంగ్‌నాన్– లి యిన్‌హుయి చేతిలో సిక్కి–ప్రణవ్ ఓటమి పాలయ్యారు.
తొలి గేమ్‌లో భారత జోడీ 15–5తో ఉన్న దశలో చైనా జోడీ జోరుపెంచింది. 19–19 స్కోరు సమం చేసి అదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను భారత్‌కు దూరం చేసింది. రెండో గేమ్‌లో ఇరు జట్లు ఒక దశలో 6–6, 14–14తో సమంగా నిలిచినా చివర్లో వరుసగా ఐదు పాయింట్లు ఇచ్చి భారత జోడీ పరాజయం ఎదుర్కొంది.