
బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ టైబ్రేక్‌లో 2–1తో మలేసియాను ఓడించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 4–4తో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ను నిర్వహించారు. భారత్ తరఫున రాహుల్ కుమార్, వివేక్ సాగర్ రెండేసి గోల్స్ చేశారు. మరోవైపు భారత జూనియర్ మహిళల జట్టు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్ చేరే క్రమంలో అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టు అంతిమ సమరంలో 1–4తో చైనా చేతిలో ఓడిపోయింది. ఫైనల్‌కు చేరిన భారత పురుషుల, మహిళల జూనియర్ జట్లతోపాటు మలేసియా, చైనా కూడా ఈ ఏడాది అక్టోబరులో అర్జెంటీనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment