ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ: శ్రీకాంత్‌ ఓటమి | kidambi srikanth out from all england open | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ: శ్రీకాంత్‌ ఓటమి

Published Fri, Mar 16 2018 2:01 PM | Last Updated on Fri, Mar 16 2018 2:01 PM

kidambi srikanth out from all england open - Sakshi

బర్మింగ్‌హామ్‌: బ్యాడ్మింటన్‌లో అతి పురాతన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి కిదాంబి శ్రీకాంత్‌ వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో చైనాకు చెందిన హుయాంగ్‌తో తలపడిన శ్రీకాంత్‌ 11-21, 21-15 , 20-22 తో పరాజయం పాలయ్యాడు. తొలి గమ్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌లో పుంజుకున్నాడు. అయితే హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ పరాయజం పాలు కావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

గత ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌ నుంచే వెనుదిరగి అభిమానులను నిరాశపరిచాడు. మరోవైపు క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సింధు తలపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement