
దుబాయ్: సూపర్–4లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తాను డీఆర్‌ఎస్ కోరకుండా ఉండాల్సిందని ఓపెనర్ కేఎల్ రాహుల్ అం టున్నాడు. మ్యాచ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా రాహుల్ సమీక్ష కోరి దాన్ని వృథా చేశాడు. ఈ ప్రభావం కీలక సమయంలో కనిపించింది.
రివ్యూలు లేకపోవడంతో ధోని, దినేశ్ కార్తీక్‌లు అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి కట్టుబడి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రాహుల్‌పై విమర్శలు వచ్చాయి. వాటిపై స్పందిస్తూ... బంతి వికెట్‌కు దూరంగా వెళ్తుందని భావించడంవల్లే రివ్యూకు మొగ్గినట్లు వివరించాడు. ఇకపై మాత్రం అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ ఉదంతం చెబుతోందని పేర్కొన్నాడు.