సానియా జోడి ఓటమి | Leander paes wins sania mirza loses at wimbledon | Sakshi
Sakshi News home page

సానియా జోడి ఓటమి

Published Mon, Jun 30 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

సానియా జోడి ఓటమి

సానియా జోడి ఓటమి

 మూడో రౌండ్‌లో పేస్ జంట  
 వింబుల్డన్ టోర్నీ
 
 లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి రెండో రౌండ్‌లో నిష్ర్కమించగా... లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌లో నాలుగో సీడ్ సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-2, 6-7 (7/9), 4-6 తేడాతో అన్‌సీడెడ్ పావ్లీచెంకోవా (రష్యా)-సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడింది. ఈ సీజన్ గ్రాండ్‌స్లామ్‌లలో సానియాకు ఇదే చెత్త ప్రదర్శన.

అయితే ఆమెకు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. రుమేనియా ఆటగాడు హోరియా టెకావుతో కలిసి సోమవారం సానియా తమ తొలిరౌండ్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఐదోసీడ్‌గా బరిలోకి దిగిన పేస్-స్టెపానెక్ జోడి రెండో రౌండ్‌లో 3-6, 6-1, 3-6, 6-3, 11-9 తేడాతో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)- స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జంటపై చెమటోడ్చి నెగ్గింది. వింబుల్డన్ టోర్నీలో తొలి ఆదివారం విశ్రాంతి దినం. సోమవారం పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో మూడో రౌండ్, నాలుగో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement