పతాకధారిగా మను భాకర్‌ | Manu Bhaker named Indias flag bearer | Sakshi
Sakshi News home page

పతాకధారిగా మను భాకర్‌

Published Tue, Oct 2 2018 10:03 AM | Last Updated on Tue, Oct 2 2018 10:03 AM

Manu Bhaker named Indias flag bearer - Sakshi

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత బృందానికి టీనేజ్‌ షూటింగ్‌ స్టార్‌ మను భాకర్‌ నేతృత్వం వహించనుంది. ఈ నెల 6 నుంచి 18 వరకు బ్యూనస్‌ ఎయిర్స్‌లో యూత్‌ ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో 16 ఏళ్ల మను భాకర్‌ త్రివర్ణ పతాకంతో జట్టును ముందుండి నడిపించనుంది.

68 మందితో కూడిన భారత జట్టు ఇందులో పాల్గొంటుంది. 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.  భారత జట్టు మంగళవారం అర్జెంటీనా బయల్దేరనుంది. జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement