గాలే: శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ (242 బంతుల్లో 166 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మంగళవారం బంగ్లాదేశ్‌తో మొదలైన తొలి టెస్టులో శ్రీలంక భారీస్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
అసెల గుణరత్నే (134 బంతుల్లో 85; 7 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 196 పరుగులు జోడించారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్, తస్కీన్, సుభాశిష్ రాయ్, మెహదీ హసన్ మిరాజ్ తలా ఒక వికెట్ తీశారు.
మెండిస్ అజేయ సెంచరీ
Published Wed, Mar 8 2017 2:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement
Advertisement