వైల్డ్‌కార్డ్ ద్వారా ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకున్న భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు నిరాశ ఎదురయింది.
రియో అవకాశం లేదన్న ఐబా
న్యూఢిల్లీ: వైల్డ్‌కార్డ్ ద్వారా ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకున్న భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు నిరాశ ఎదురయింది. నిబంధనల ప్రకారం ఆమెకు వైల్డ్‌కార్డ్ వచ్చే అవకాశం లేదని అంతర్జాతీయ సమాఖ్య నియమించిన అడ్‌హక్ కమిటీ చైర్మన్ కిషన్ నర్సి తెలిపారు. ‘గత రెండు ఒలింపిక్స్‌లో ఏ దేశం నుంచైనా ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువమంది బాక్సర్లు క్రీడల్లో పాల్గొంటే ఆ దేశానికి వైల్డ్‌కార్డ్ ఇవ్వరు. ఐఓసీ నిబంధనలు అలా ఉన్నాయి. కాబట్టి మేరీకోమ్‌కు అవకాశం లేదు’ అని ఆయన చెప్పారు.